టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. హార్దిక్ పాండ్యా భార్య నటాషా అతనికి విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోడల్, హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ పాండ్యా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. 2020లో ఈ జంట వివాహం చేసుకున్నారు. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు పెళ్లికి ముందే కమిట్ అయ్యారని తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది. పెళ్లి తర్వాత ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు.
ఇటీవలి కాలంలో వీరి కాపురంలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, నటాషా మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు ప్రస్తుతం విడిగా జీవనం కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని అందరూ భావించారు. ఇదే సమయంలో నటాషా చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేస్తూ, ‘ఒకరు రోడ్డున పడబోతున్నారు’ అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేసింది. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యా గురించి ఉందని నెటిజన్లు రచ్చ మొదలు పెట్టారు. దీనికి తోడు, నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. ఈ చర్యలతో, నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమని ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
నటాషా సెర్బియాకు చెందిన మహిళ కావడంతో, భరణం అధికంగా అడిగే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకి ఇవ్వవలసి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణాల వల్లే పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని సమాచారం.
ఇదిలా ఉంటే, హార్దిక్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి అన్ని ఖాతాలకు భాగస్వామిగా ఉంటుందని, తన ఆస్తిలో రూ. 50% హక్కు తల్లికే చెందుతుందని హార్దిక్ చెప్పాడు. తాను ఏది కొన్నా, అది కారు అయినా, ఇల్లు అయినా ప్రతిదానిలో అమ్మకు సమాన వాటా ఉంటుందని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా మరియు నటాషా విడాకులు అనేది ఒక పెద్ద విషయం, దీనికి సంబంధించిన వార్తలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పాండ్యా ఫ్యామిలీ మరియు న్యాయ నిపుణులు ఈ విషయం పై స్పందించవలసి ఉంది. ఏదేమైనప్పటికీ, వారి భవిష్యత్తు కోసం అందరూ మంచి కోరుకుంటున్నారు.